12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు
నక్కపల్లి : చినదొడ్డిగల్లు శివారులో జరుగుతున్న పేకాటశిబిరంపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం సీఐ మురళికి వచ్చిన సమాచారం మేరకు చినదొడ్డిగల్లులో ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడుల్లో పేకాట రాయుళ్ల నుంచి రూ.73,400 నగదు, 13 సెల్‌ఫోన్‌లు,3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.


