పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ పథకాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ పథకాలపై అవగాహన కల్పించాలి

Feb 8 2026 4:09 AM | Updated on Feb 8 2026 4:09 AM

పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ పథకాలపై అవగాహన కల్పించాలి

పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ పథకాలపై అవగాహన కల్పించాలి

చింతపల్లి: స్థానిక పోస్టల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఖాతాదారుల్లో ఎక్కువ మందిని ఇన్సూరెన్స్‌ పాలసీ లబ్ధిదారులుగా చేర్చాలని పోస్టల్‌ సౌత్‌ సబ్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. దివాకర్‌ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాలకు చెందిన పోస్టల్‌ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఈ రెండు మండలాల పరిధిలో ఉన్న ఖాతాదారులు, ప్రజలకు తపాలా ఇన్సూరెన్స్‌ వల్ల కలిగే లాభాలను వివరించి చేర్పించాలని సూచించారు.గ్రామీణ తపాలా ఇన్సూరెన్స్‌, పోస్టల్‌ ఇన్సూరెన్స్‌, పీవో ఎస్బీ ఖాతాలను పెద్ద ఎత్తున తెరిపించి, ఎక్కువ మందిని చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెయిల్‌ ఓవర్సీర్‌ శ్రీనివాస్‌, రెండు మండలాల బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్లు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.

ఆశాఖ సౌత్‌ సబ్‌ డివిజనల్‌

ఇన్‌స్పెక్టర్‌ దివాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement