కల్యాణపులోవనుసందర్శించిన డీఎస్పీ శ్రావణి | - | Sakshi
Sakshi News home page

కల్యాణపులోవనుసందర్శించిన డీఎస్పీ శ్రావణి

Feb 7 2026 9:51 AM | Updated on Feb 7 2026 9:51 AM

కల్యాణపులోవనుసందర్శించిన డీఎస్పీ శ్రావణి

కల్యాణపులోవనుసందర్శించిన డీఎస్పీ శ్రావణి

పోతురాజుబాబు ఆలయ పరిసరాలను సందర్శిస్తున్న డీఎస్పీ శ్రావణి

రావికమతం: కల్యాణపులోవ పోతురాజుబాబు జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించడంతో పాటు భద్రతా పరమైన చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పోలీసులను ఆదేశించారు.ఆమె శుక్రవారం కల్యాణపులోవలో పోతురాజుబాబు అలయం,పెద్దింటమ్మ గుడి, జలాశయం వద్ద పుణ్య స్నానాలు ఆచరించే ప్రదేశాలు, వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలను, జాతర ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. జాతరకు ఏ స్థాయిలో భక్తులు తరలివస్తారో ఆరా తీశారు. గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌, రిజార్వయర్‌ నీటి సంఘం కమిటీ చైర్మన్‌ బంటు రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement