అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

అప్పన

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

●శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు 1
1/1

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement