అంతర పంటలతో అధిక ఆదాయం
ఇన్‌చార్జ్జి జేసీ, ఐటీడీఏ పీవో
తిరుమణి శ్రీపూజ
పాడేరు: కాఫీ సాగును పెంపొందించడంతో పాటు అంతర పంటల సాగుపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలతో పాటు అధిక ఆదాయం లభిస్తుందని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమ వారం సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాఫీ సాగులో అంత రపంటల ఉత్పత్తులను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన ప్రణాళికలను రూపొందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిక్స్‌డ్ క్రాప్ ఏర్పాటు అనుకూలమైన ప్రాంతాల్లో కాఫీతో పాటు ఇతర మిశ్రమ పంటలను ప్రోత్సహించడం వల్ల రైతులకు అదన పు ఆదాయం లభిస్తుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సేంద్రియ ఎరువుల వినియోగం యాజమాన్యంపై ప్రత్యక్ష శిక్షణ ఇవ్వాలన్నారు. కాఫీ బోర్డు అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని సూచించారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి విత్తన సేకరణ, నర్సరీల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకుని మొక్కల పెంపకంపై ప్రోత్సహకాలు, రాయితీలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ డీడీ మురళీధర, కాఫీ ఏడీ బొంజుబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏలో ఆధార్ సెంటర్ ఏర్పాటు
పాడేరు : గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 150 ఆధార్ ఎన్‌రోల్ కిట్లు మంజూరయ్యాయని, వీటిని జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధార్ కేంద్రంలో పుట్టిన తేదీ సవరణలు, బయోమెట్రిక్ అప్‌డేట్స్, కొత్త ఆధార్ కార్డుల జారీ వంటి సేవలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఏ దరఖాస్తు కూడా తిరస్కరణకు గురికాకుండా ఉండేలా చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లో పరిష్కారం కాని ఆధార్ సమస్యలకు పాడేరు ఐటీడీఏ అధార్ సెంటర్‌లో పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, పీఎంయూ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అధికారి రాంగోపాల్, అడిషనల్ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అధికారి రాజేష్, ఆధార్ జిల్లా కో ఆర్డినేటర్ వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


