కుస్తీ పట్టి..పతకాలు కొట్టి | - | Sakshi
Sakshi News home page

కుస్తీ పట్టి..పతకాలు కొట్టి

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

కుస్త

కుస్తీ పట్టి..పతకాలు కొట్టి

రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

గోల్డ్‌మెడల్స్‌ సాధించిన కొయ్యూరు, చింతపల్లి క్రీడాకారులు

కొయ్యూరు: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కుస్తీ పోటీల్లో కొయ్యూరు కుస్తీ అకాడమీ, చింతపల్లి డిగ్రీకళాశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొయ్యూరు కుస్తీ అకాడమీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అండర్‌ 15, అండర్‌ 17,అండర్‌ 20 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను సాధించి, వచ్చే నెలలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 17 మంది ఎంపికయ్యారు. అండర్‌ 20 విభాగంలో వి.మహేష్‌, పి.ధారవీర ప్రసాద్‌, ఎం.రమణబాబు, సీహెచ్‌ మహేష్‌, కె.రూతు, కె.సుజాత, కె.కెసియ, కె.కమల, బి.భార్గవ్‌ బంగారు పతాకాలు సాధించారు.అండర్‌ 17 విభాగంలో కె.తబిత, పి.సురేష్‌, వి.శ్రీనుబాబు, ఎస్‌.రాజు, దుర్గాప్రసాద్‌లు బంగారు పతాకాలు సాధించారు.అండర్‌ 15 విభాగంలో జి.బుజ్జిబాబు, పి.శ్రీను, డి.ఆదినారాయణ బంగారు సాధించి ఢిల్లీలో వచ్చేనెల జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరితో పాటు జి.చరణ్‌,కె.చందు, వి.రాజేష్‌లు వెండిపతాకాలు సాధించారు.చిత్తూరు నుంచి సోమవారం కొయ్యూరు వచ్చిన వీరిని, పీడీ అంబటి నూకరాజును హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

చింతపల్లి: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో చింతపల్లి డిగ్రీ కళాశాలు విద్యార్థులు బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.విజయభారతి తెలిపారు. బి.భార్గవి, కె.రూతూ,కె.తబిత,కె.కేసియా, వి, మహేష్‌లు బంగారు పతకాలు సాధించారని చెప్పారు అనంతరం విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ శివరాంను ప్రిన్సిపాల్‌ అభినందించారు.

కుస్తీ పట్టి..పతకాలు కొట్టి 1
1/1

కుస్తీ పట్టి..పతకాలు కొట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement