పలు చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

పలు చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు శిక్ష

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

పలు చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు శిక్ష

పలు చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు శిక్ష

అనకాపల్లి: పలు దొంగతనాల కేసుల్లో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి న్యాయమూర్తి ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్‌ చెప్పారు. విశాఖ జిల్లా గాజువాక మండలం అగనంపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ తాటిపూడి శంకర్‌కు పలు చోరీలకు పాల్పడడంతో మొదటి ఏజేసీజే న్యాయమూర్తి ఎ.రమేష్‌ శంకర్‌కు ఏడాదిన్నర జైలు శిక్షవిధిస్తూ బుధవారం తీర్పు చెప్పినట్టు పట్టణ సీఐ తెలిపారు. అనకాపల్లి పట్టణ పరిధిలో 2019 సంవత్సరంలో లక్ష్మీదేవీపేట, పాత్రుడు కాలనీ, సాయినగర్‌, కొత్తూరు, గవరపాలెం, నూకాంబిక ఆలయవీధిలో చోరీలకు పాల్పడిన తాటిపూడి శంకర్‌పై అప్పటి సీఐ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా వాదోపవాదాలు అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్టు సీఐ చెప్పారు. ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ అసిస్టెంట్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మృణాళిని వాదనలు వినిపించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement