హోరాహోరీగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
సబ్బవరం: మండలంలోని గొర్లివానిపాలెంలో కొలువైన కుంచాలమ్మ, మంచాలమ్మ, బంగారమ్మ తల్లి తీర్థమహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు వరుసగా రూ.20,116, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7,500 నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు అందించన్నుట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఎంపీటీసీ గొర్లి చైతన్య, గ్రామ పెద్దలు, నాయుకులు గండి దేముడు, బాదిరెడ్డి లక్ష్మణ, గొర్లి కృష్ణ పాల్గొన్నారు.
గొర్లివానిపాలెం తీర్థమహోత్సవం
సందర్భంగా నిర్వహణ


