ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం! | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం!

Feb 10 2026 7:36 AM | Updated on Feb 10 2026 7:36 AM

ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం!

ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం!

మునగపాక: పాటిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆకతాయిలెవరో అపహరించేందుకు యత్నించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం ఆలయం పైకి వెళ్లిన స్థానికులకు అభయాంజనేయ స్వామి విగ్రహం స్థానచలనం అయినట్టు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు విగ్రహాన్ని ఎత్తుకుపోయేందుకు యత్నించినట్టు గుర్తించారు. దీంతో స్థానికులు కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement