రోడ్డు ప్రమాదంలోఇద్దరికి తీవ్ర గాయాలు
జి.మాడుగుల: మండలంలోని మద్దిగరువు వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధా న రహదారిపై అనర్భ గ్రామం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్ర మాదం జరిగింది. పాసింజర్ జీపు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మద్దిగరువు వారపు సంత నుంచి ప్రయాణికులతో జి.మాడుగుల వైపు వస్తున్న టికెట్ సర్వీసింగ్ జీపు, కిల్లంకోట పంచాయతీ కె.బందవీధి గ్రామానికి చెందిన పొత్తూరి తిరుపతిరావు, ఎండ్రపల్లి మురళి ప్రయాణిస్తున్న బైక్‌ను అనర్భ గ్రామ సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న తిరుపతిరావు, మురళీకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.


