విద్యార్థులు లక్ష్య సాధనలో పోటీ పడాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్య సాధనలో పోటీ పడాలి

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

విద్యార్థులు లక్ష్య సాధనలో పోటీ పడాలి

విద్యార్థులు లక్ష్య సాధనలో పోటీ పడాలి

కొయ్యూరు: ఇష్టపడి చదివితే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనలో పోటీ పడాలని ప్రముఖ నవలా రచయిత, మోటివేషనల్‌ స్పీకర్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ పిలుపునిచ్చారు. కొయ్యూరు పోలీసులు, ’నేను సైతం’ చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక కేజీబీవీలో వ్యక్తిత్వ వికాస తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యండమూరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జీవితంలో కష్టసుఖాలు సహజమని, ప్రస్తుతం వివిధ రంగాల్లో విజయపథంలో కొనసాగుతున్న వారందరి జీవితాలు పూలపాన్పులు కావని ఆయన గుర్తుచేశారు. వారంతా ఎంతో కష్టపడి పైకి ఎదిగినవారేనని పేర్కొన్నారు.జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని సవాలుగా స్వీకరించి, విజయపథంలో పయనించే లక్షణాలను విద్యార్థులు అలవరచుకోవాలనిసూచించారు.

ఈ సందర్భంగా యండమూరిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కిషోర్‌ వర్మ, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement