ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఐక్య పోరాటం
పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు వి. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ, సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు అందజేసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను అందరూ వ్యతిరేకించాలన్నారు. ఉపాధి హామీ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, వారి ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శంకర్ రావు, సింహచలం, ముత్యకొండమ్మ, నీలకంఠం పాల్గొన్నారు.


