భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : ఏజెన్సీలో భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి భూ హక్కులు కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ బొక్కెళ్లు గ్రామంలో బుధవారం 43 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలో భూమి రికార్డుల్లో సాంకేతికంగా లోపాలు, పేర్ల తప్పులు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు చేపట్టామన్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి హక్కుతో కూడిన పాసు పుస్తకాలను అందజేశామని ఆయన వివరించారు.
పారదర్శకంగా పట్టాదారు పాసు పుస్తకాలు :
ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో
తిరుమణి శ్రీపూజ
అరకులోయ టౌన్: గిరిజన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అత్యంత పారదర్శకంగా, తప్పుల్లేని రికార్డులను అందించడమే లక్ష్యంగా పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని లిట్టిగుడ గ్రామంలో రీ–సర్వే పూర్తయిన సందర్భంగా, 36 మంది గిరిరైతులకు ఆయన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎటువంటి తప్పులు లేకుండా రాజముద్రతో అధికారికంగా ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు.పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం లబ్ధిదారులకు వెంటనే ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. దీనివల్ల యాజమాన్య హక్కులు డిజిటల్ పద్ధతిలో ధ్రువీకరించబడి, రైతులకు పూర్తి భరోసా కలుగుతుందన్నారు. రీ–సర్వే వల్ల భూ వివాదాలకు ముగింపు పలకడమే కాకుండా, పారదర్శకమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని జేసీ వివరించారు. పాసు పుస్తకాల ముద్రణకు ముందే తహసీల్దార్ ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు స్వయంగా గ్రామస్తుల వద్దకు వెళ్లి, వివరాలలోని తప్పుప్పులను సరిచూసుకున్న తర్వాతే ముద్రణకు పంపినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్టీసీ విజయనగరం రీజనల్ చైర్మన్ దొన్నుదొర, తహసీల్దార్ కుమారస్వామి, డీటీ పంచాడి గోవిందరావు, ఆర్‌ఐ పట్టాసి శంకరరావు, సర్పంచ్ దాసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు


