వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
చింతపల్లి: మండలంలో టెన్త్‌లో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు పాడేరు, అరకువేలీ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎంఈవో ప్రసాద్ తెలిపారు. మండలానికి చెందిన సి,డి గ్రేడ్‌ల్లో ఉన్నటు 29 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. వీరిని ఉన్నతాధికారుల ఆదేశాలు, తల్లిదండ్రుల అంగీకారం మేరకు 13 మంది విద్యార్థినులను అరకువేలీ ఉన్నత పాఠశాలకు,16 మంది బాలురలను పాడేరు ఉన్నత పాఠశాలకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు పాఠశాలకు సంబంధించిన ముగ్గురు ఉపాధ్యాయులను పంపిస్తున్నామన్నారు. ఈ శిక్షణ నెల రోజులపాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్‌ఎం గిడ్డి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


