చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి

Feb 11 2026 7:31 AM | Updated on Feb 11 2026 7:31 AM

చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి

చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి

యలమంచిలి రూరల్‌: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఫైనల్‌ చార్జ్‌ షీట్‌లో నిగ్గుతేల్చిందని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గసమన్వయకర్త కర ణం ధర్మశ్రీ తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని తెలుపుతూ ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లబ్ధికోసం తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా పదేపదే ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని ఆయనడిమాండ్‌ చేశా రు.లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని,చేప నూనె కలి పారని ఆరోపణలు చేసి పాపానికి ఒడిగట్టారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కిలోనెయ్యి రూ.320కి కొంటే,చంద్రబాబు హయాంలో రూ.290కే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.బోలే బాబా సంస్థకు సర్టిఫికెట్‌ ఇచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2019 మార్చి 6న ఆసంస్థకు 82వేల కిలోల నెయ్యి ని ఆర్డర్‌ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే ని తెలిపారు.సీబీఐ సిట్‌ ఎన్‌డీడీబీ,ఎన్‌డీఆర్‌ఐలు ఇచ్చిన నివేదికలు నిజం కాదట,చంద్రబాబు చెప్పి ందే నిజమట అని మండిపడ్డారు.చేసిన తప్పులకు చెంపలు వేసుకుని చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు.

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement