మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం.
–ఎం.వినోద్‌బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్
పర్యవేక్షిస్తున్నాం..
గత ఏడాది కంటే మంచి ఫలితాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక ప్రణాళికతో విద్యార్ధులకు తర్ఫీదునిస్తున్నాం. అధ్యాపకులు వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించి ప్రతీ రోజు పురోగతిని పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్ధులకు సహకారం అందించాలి. ఇంటి వద్ద విద్యార్ధులను పర్యవేక్షించి జాగ్రత్తగా చదివేలా చూడాలి.
–డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, ప్రిన్సిపాల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటవురట్ల
మంచి స్థానం కోసం..


