ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా త్రినాఽథ్
బుచ్చెయ్యపేట: ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కందిపూడి ఉపాధ్యాయుడు తమరాన త్రినాఽథ్ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర ఏపీటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో త్రినాఽథ్‌ను ఏకగ్రీవంగా ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు. పి. కందిపూడి పాఠశాలలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పదవులు నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏపీటీఎఫ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని త్రినాథ్ తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.


