అరకువేలీలో తగ్గిన ఉష్ణోగ్రతలు
● 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం అరకువేలిలో 6.5 డిగ్రీ లు, ముంచంగిపుట్టులో 7.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 8.8 డిగ్రీలు, హుకుంపేటలో 9.1 డిగ్రీలు, జి.మాడుగులలో 10.3 డిగ్రీలు, చింతపల్లిలో 10.5 డిగ్రీలు, కొయ్యూరులో 12.9 డిగ్రీ లు, అనంతగిరిలో 15.1 డిగ్రీలు నమోదు అయ్యాయయని ఆయన పేర్కొన్నారు.


