పోరాటాలతోనే హక్కుల సాధన | - | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే హక్కుల సాధన

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

పోరాటాలతోనే హక్కుల సాధన

పోరాటాలతోనే హక్కుల సాధన

చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే అడ్డుకోగలమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్‌ అన్నారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులను బానిసలుగా మార్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వాలు చట్టాలను తీసుకువస్తున్నాయని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రతి కార్మికుడు ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి శానిటేషన్‌ కార్మిక యూనియన్‌ నాయకులు సత్యనారాయణ, ఈశ్వరరావు, లక్ష్మి, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

బోనంగి చిన్నయ్యపడాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement