13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

పాడేరు : భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. సురక్షిత బ్యాంకింగ్‌ విధానాలు పాటించడం, డిజిటల్‌ లావా దేవీలు జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాటు చేసుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందటం వంటి అంఽశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ మాతునాయుడు, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా ఫౌరసరఫరాల శాఖ అధికారి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement