నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

Feb 10 2026 7:36 AM | Updated on Feb 10 2026 7:36 AM

నిండు

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

● బొలేరో వ్యాన్‌, బైకు ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి ● ప్రాణాపాయ స్థితిలో మరో యువకుడు

అచ్యుతాపురం రూరల్‌: బొలేరో వాహనం డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తాడు అనుకునేలోపే కుమారుడు అంతుచిక్కని లోకాలకు వెళ్లిపోయాడన్న చేదు నిజం ఒక తల్లి గుండెలను చిదిమేసింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో యర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండ సాయి (22) బ్రాండిక్స్‌లో గల టీజే పరిశ్రమలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో సుప్రజా డెయిరీ ఎదురుగా అకస్మాత్తుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన బొలేరో వాహనంను ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో వెనక కూర్చున్న రావాడ శ్రీను కూడా తీవ్రంగా గాయపడి ఆరిలోవలో గల ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యర్రవరంలో ఒక ఇంట్లో జరుగుతున్న జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదం బారినపడి ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన సాయి తండ్రి సంవత్సరం క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు తనకు అండగా ఉంటాడనుకున్న ఆ తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. కొడుకు మృతితో తల్లి గుండెలవిసేలా చేసిన రోదన గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన రావాడ శ్రీనుకు వివాహమై ఒక కుమార్తె ఉంది. విధుల నుంచి వస్తూ శ్రీను ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతున్ని వేడుకుంటున్నారు.

కాగా ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం సుప్రజ డెయిరీ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రమాదానికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి అలాగే ఆసుపత్రిలో ఉన్న యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఎం, సీఐటీయు, అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా రహదారి పూర్తిగా స్తంభించడంతో కొన్ని గంటల వ్యవధి ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

అనుకోకుండా బొలేరో వాహనం సుప్రజా డెయిరీలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా రహదారికి అడ్డంగా రావడంతో బైక్‌ పై ఉన్నవారు అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడతున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ చంధ్రశేఖర్‌రావు తెలిపారు.

గాయపడిన

రావాడ శ్రీను

సంఘటనా స్థలంలో సాయి మృతదేహం

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం 1
1/3

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం 2
2/3

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం 3
3/3

నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement