ఇంటర్ ప్రయోగ పరీక్షల పరిశీలన
జి.మాడుగుల: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రయోగ పరీక్ష పరీక్షలను ఆదివారం ఇంటర్‌బోర్డు అబ్జర్వర్ చాణుక్యుడు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరు, ల్యాబ్ సదుపాయాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా డీఈసీ సభ్యుడు ఎం.స్వామినాయుడు కళాశాలను సందర్శించి పరీక్షల ప్రక్రియను పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణపై అధ్యాపకులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గౌరీ ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.
చింతపల్లి: ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అబ్జర్వర్ చాణక్యుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన అందించాలని అధ్యాపకులకు సూచించారు. డీఈసీ సభ్యుడు ఎం.స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇంటర్ ప్రయోగ పరీక్షల పరిశీలన


