● ఎకై ్సజ్ ఎస్‌ఐ కొలువు సాధించిన శివకుమార్
● ఘనంగా సత్కారం
అరకులోయ టౌన్: అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న డి. శివకుమార్ గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి, ఎకై ్సజ్ ఎస్‌ఐ పోస్టుకు ఎంపిక కావడం అభినందనీయమని ఎంపీడీవో అడపా లవరాజు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శివకుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. బస్కీ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే, కష్టపడి చదివి విజయనగరం జిల్లాలో ఎకై ్సజ్ ఎస్‌ఐగా ఎంపికవ్వడం గర్వకారణమన్నారు. ఆయన విజయం తోటి ఉద్యోగులకు, నిరుద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొని శివకుమార్‌కు అభినందనలు తెలిపారు.


