ఆటో, బైక్‌ ఢీ.. వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్‌ ఢీ.. వృద్ధురాలు మృతి

Mar 19 2026 7:49 AM | Updated on Mar 19 2026 7:49 AM

● యువకుడికి గాయాలు

రావికమతం : మండలంలో కొత్తకోట దాటిన తరువాత వమ్మవరం వెళ్లే రూటు దగ్గరలో బుధవారం ఆటోను బైక్‌ బలంగా ఢీ కొట్టిన సంఘటనలో వృద్ధురాలు మృతి చెందగా యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలో కొత్తకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన దుర్ఘటన వివరాలివి. రోలుగుంట మండలం బలిజిపాలెం గ్రామానికి చెందిన కంట్రెడ్డి దేముళ్లుమ్మ (65) కొత్తకోట నుంచి సొంత గ్రామం బలిజిపాలెం వెళ్లేందుకు ఏపీ05 టీఎన్‌1905 నంబర్‌ గల ఆటో ఎక్కింది. ఆటో కొత్తకోట దాటి వెళ్తుండగా అదే సమయంలో వమ్మవరం గ్రామం నుంచి ఏపీ 40 హెచ్‌బి 1633 నంబర్‌ గల బైక్‌పై వస్తున్న పండూరు ప్రశాంత్‌ ఆటోను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆటో డ్రైవరు ఈశ్వరరావుకు స్వల్పంగా గాయాలుకాగా, ఆటోలో ప్రయాణం చేస్తున్న దేముళ్లమ్మకు, బైకుపై వస్తున్న ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కొత్తకోట పీహెచ్‌సీకి తరిలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దేముళ్లమ్మ పరిస్థితి విషమించి మృతి చెందగా, ప్రశాంత్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం కేజిహెచ్‌కు తరిలించారు. దీనిపై కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గాయపడిన యువకుడు పండూరు ప్రశాంత్‌

మృతి చెఽందిన దేముళ్లుమ్మ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement