● నవోదయ, సైనిక్ స్కూల్‌రెండింటికీ ఎంపిక
● సత్తా చాటిన గిరిజన బాలిక
కొయ్యూరు: మండలాని కి చెందిన ఒక గిరిజన విద్యార్థిని అద్భుత ప్రతిభ కన బరిచింది. గదబపా లెం పంచా యతీ మల్లవరం గ్రామానికి చెందిన తుబిరి వర్షిణి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటింది. ఒకే విద్యా సంవత్సరంలో అటు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష (ర్యాంక్ 169)లోనూ, ఇటు కోరుకొండ సైనిక్ పాఠశాల (178/300) ప్రవేశ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించి రెండింటికీ ఎంపికై ంది. వర్షిణి తండ్రి మల్లేష్ గిరిజన సంక్షేమ శాఖలో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతో కష్టపడి చదివిన వర్షిణి, అత్యంత కఠినమైన ఈ రెండు ప్రవేశ పరీక్షల్లోనూ సీటు సాధించడం విశేషం. తన కుమార్తె అటు నవోదయకు, ఇటు ప్రతిష్టాత్మకమైన సైనిక్ పాఠశాలకు ఎంపిక కావడంపై ఆమె తండ్రి మల్లేష్‌తో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


