● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా లని అరకులోయ ఎమ్మె ల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు.


