● సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు
సాక్షి,పాడేరు: అల్లూరి, పోలవరం జిల్లాల పరిధిలోని 19 కేజీబీవీల్లో ప్రవేశాలకు ఈనెల 12వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంచనున్నట్టు సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడిబయట ఉన్న పిల్లలకు మొదటి ప్రాధాన్యత, తల్లిదండ్రులు లేని వారికి రెండో ప్రాధాన్యత, సింగిల్ పేరెంట్ పిల్లలకు 3వ ప్రాధాన్యత,విభిన్న ప్రతిభావంతులు,ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు 4వ ప్రాధాన్యత ఇస్తామన్నారు.ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ప్రతి కేజీబీవీలో 40 సీట్లు ఉంటాయన్నారు. కేజీబీవీల్లో టెన్త్ చదివి ఉత్తీర్ణులైన బాలికలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఓసీ ఓపెన్ కేటగిరిలో 50శాతం, ఎస్సీలకు 15శాతం,ఎస్టీలకు 6 శాతం, బీసీ–ఎ 7శాతం,బీసీ–బి 10శాతం,బీసీ–సి 1శాతం, బీసీ–డి 7శాతం,బీసీ–ఈ 4 శాతం, అనాథలు,అంగవైకల్యం కలిగిన వారికి 10 శాతం చొప్పున 40 సీట్లను భర్తీ చేస్తామన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాలకు గాను ఈనెల 12వతేదీ నుంచి ఏప్రిల్ 1వతేదీ వరకు https://apkgbv. apcfss. inలో ఆన్‌లైన్ ద్వారా సమగ్ర వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. రెండు జిల్లాల పరిధిలో 6వ తరగతిలో 760 సీట్లు,7వ తరగతిలో 25 సీట్లు.8వతరగతిలో 15సీట్లు, 9వ తరగతిలో 20 సీట్లు,ఇంటర్ మొదటి సంవత్సరంలో 760సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు.అర్హులైన బాలికలంతా దర ఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు.


