గౌరీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టకు చురుగ్గా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గౌరీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టకు చురుగ్గా ఏర్పాట్లు

Mar 11 2026 7:39 AM | Updated on Mar 11 2026 7:39 AM

జి.మాడుగుల: మండలంలోని గాంధీనగరంలో హనుమాన్‌ ఆశ్రమం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 20అడుగుల గౌరీ పరమేశ్వరు లు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 19వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా హనుమా న్‌ ఆశ్రమంలో భీమిలి సద్గరు సేవాశ్రమం ప్రతినిధి సాయిరాం స్వామీజీ, కమిటీ సభ్యులు మంగళవారం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ సద్గురు సేవాశ్రమం ద్వారా 2017సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అల్లూరి జిల్లాలో 999 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. 19న ప్రతిష్టించనున్న విగ్రహం 1000వ విగ్రహమని చెప్పారు. ఆ రోజు అన్నసమారాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో హనుమాన్‌ సేవాశ్రమ కమిటీ సభ్యులు మత్స్యరాస మత్స్యరాజు, రీమెలి అప్పలరాజు, సన్యాసిరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement