అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని ఎన్‌ఆర్‌పురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీనటడు సుమన్, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శనివారం దర్శించుకున్నారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రధాన రాజగోపుర ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రతిమలను ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడబారికి మిథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, పార్టీ మండల పరిశీలకుడు సెంబి సన్యాసిరావు, వాలసి సర్పంచ్ బాక గురుమూర్తి పాల్గొన్నారు.


