అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారికి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీర, పట్టువస్త్రాలు, సారెను శుక్రవారం సమర్పించారు. అమ్మవారు సారెను ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు తిప్పాన అప్పారావు, గౌరవాధ్యక్షుడు పంపాన సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వరరావు, సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


