పాడేరు: ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ దినేష్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, కాకినాడ అసిస్టెంట్ కలెక్టర్ మనీషా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో అమరజీవి కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం అమరావతిలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వర్చువల్‌గా వీక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక,సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాద్‌రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


