10.8 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

10.8 కిలోల గంజాయి పట్టివేత

Mar 14 2026 7:42 AM | Updated on Mar 14 2026 7:42 AM

ఎస్‌.రాయవరం: అడ్డురోడ్డు జంక్షన్‌లో 10.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఎల్‌. రామకృష్ణ శుక్రవారం చెప్పారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి నర్సీపట్నం మీదుగా ఆర్టీసీ బస్సులో అడ్డురోడ్డు జంక్షన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి చైన్నె వెళ్లేందుకు ఫ్లైఓవర్‌ కింద నిలుచుని ఉండగా అనుమానంతో ఎస్‌.రాయవరం పోలీసులు తనిఖీ చేసినట్టు సీఐ చెప్పారు. బ్యాగ్‌లో గంజాయి బయటపడడంతో తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన హరికృష్ణ,విఘ్నేష్‌ అనే ఇద్దరితో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ విభీషణరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న

సీఐ రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement