రావికమతం: తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాతు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కొత్తకోట పోలీసులు తెలిపిన వివరాలు.. మత్సవానిపాలెం గ్రామానికి చెందిన సబ్బి నాగేశ్వరరావు(30) కూలిపని నిమిత్తం తాటి కమ్మ నరికేందుకు గ్రామానికి చెఽందిన మరో నలుగురితో కలిసి మర్రి వలస శివారు గొల్లలపాలెంకు శుక్రవారం వెళ్లాడు. తాటి కమ్మలు నరకు తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడ్డాడు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును సహచర కూలీలు కొత్తకోట పీహెచ్‌సీకి తరిలించగా అప్పటికై మృతి చెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య నాగలక్ష్మి,రెండేళ్ల కుమార్తె ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హెచ్‌సీ సి.భాస్కర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినుట్ట హెచ్‌సీ చెప్పారు.


