బుచ్చెయ్యపేట: మండలంలోని బీఎన్ రోడ్డులో వడ్డాది కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్‌బీ పురానికి చెందిన మొల్లి అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. తోపుడు రిక్షాపై ఊరూరా తిరిగి కల్లు ఉప్పు అమ్ముకుని జీవించే అప్పలనాయుడు శుక్రవారం ఎల్‌బీ పురం నుంచి వడ్డాదికి ఉప్పు తీసుకెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీ కొంది. దీంతో అప్పలనాయుడు తుప్పల్లో తూలిపడగా, తోపుడు రిక్షా దెబ్బతిని, ఉప్పు రోడ్డు పాలైంది. తీవ్రంగా గాయపడిన అప్పలనాయుడును స్థానికులు 108 వాహనంలో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఆగకుండా పరారయ్యాడు. బుచ్చెయ్యపేట పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రమాదంలో దెబ్బతిన్న తోపుడు రిక్షా
గాయపడిన అప్పలనాయుడు


