రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Mar 14 2026 7:42 AM | Updated on Mar 14 2026 7:42 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

దిలీప్‌కుమార్‌ మృతదేహం

మాకవరపాలెం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడికి చెందిన జవ్వాది దిలీప్‌కుమార్‌(19) శుక్రవారం మండలంలోని జి.కోడూరులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. తిరిగి మధ్యాహ్నం నర్సీపట్నం మీదుగా బైక్‌పై స్వగ్రాం బయలుదేరాడు. మండలంలోని దాలింపేట వద్దకు వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న లారీ, బైక్‌ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో దిలీప్‌కుమార్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో బైక్‌ ముందు చక్రం సైతం వేరైంది. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ దామోదర్‌నాయుడు పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement