లోపూడిలో దగ్ధమైన సరుగుడు తోట
బుచ్చెయ్యపేట: మండలంలోని లోపూడి లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సరుగుడు,టేకు తోటలు దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిపారేసిన సిగరెట్టు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన ఉడికొట్టు పోతురాజు,బండి బోడమ్మలకు చెందిన 60 సెంట్ల భూమిలో సరుగుడు,టేకు తోటలు కాలిపోయాయి. గ్రామస్తులు,రైతులు సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు.


