● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
హుకుంపేట: గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం గ్రామసచివాలయ వ్యవస్థతోనే సాధ్యపడిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం మండలంలోని సూకూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థ వల్లే సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరువ అయ్యాయన్నారు. అదే ఆశయంతో ప్రజలకు సేవలు అందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. సర్పంచ్ ధనసాని సత్యవతి, ఎంపీటీసీ కిలగడ సింహాచలం, పీఆర్ జేఈ సంజీవ్, పార్టీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, సర్పంచ్‌లు సమిడ వెంకటపూర్ణిమ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు కాకరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


