అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు

Mar 13 2026 7:52 AM | Updated on Mar 13 2026 7:52 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణసంపెంగ పుష్పాలతో స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు అందించారు.

వైభవంగా నిత్యకల్యాణం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం, కల్యాణ అక్షింతలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement