ప్రజాసంక్షేమమే అజెండా | - | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమమే అజెండా

Mar 13 2026 7:51 AM | Updated on Mar 13 2026 7:51 AM

అరకులోయలో వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పార్టీ నేతలు

పాడేరు పాతబస్టాండ్‌లో వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు

అర్పిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, నేతలు

వాడవాడలా ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

సాక్షి, పాడేరు: మహానేత డాక్టర్‌ వైఎస్‌ మరణాంతరం, ప్రజల సంక్షేమమే అజెండాగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన పాడేరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాడేరులోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో పాటు పార్టీలోని అన్ని విభాగాల నేతలు పాల్గొన్నారు. అనంతరం పాడేరు పాత బస్టాండ్‌లోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్‌ను కట్‌ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. పాత బస్టాండ్‌ ఆవరణలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతుగా కార్యకర్తలు చేసిన నినాదాలు హోరెత్తాయి. వేడుకల అనంతరం జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య సేవల వార్డులో గర్భిణులు, బాలింతలు, రోగులకు ఎమ్మెల్యే పాలు, రొట్టెలను పంపిణీ చేశారు.

కూటమి ప్రభుత్వంపై ధ్వజం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కోసం పుట్టిన వైఎస్సార్‌సీపీకి అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. గత ఐదేళ్ల పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, అధికార ప్రతినిధి కూడ సురేష్‌కుమార్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, ఎస్టీసెల్‌ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దిసారి గంగరాజు, వలంటీర్ల సంఘ ప్రతినిధులు కొమ్ము సురేష్‌, కొమ్మ రాంబాబు, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, చిప్పాడ మీనా, తవుడు ఎర్రయ్యమ్మ, సర్పంచ్‌లు వనుగు బసవన్నదొర, గొల్లూరి నీలకంఠం, పార్టీ నేతలు లకే రామసత్యవతి,గుల్లెలి లింగమూర్తి, పాంగి నాగరాజు, మోదబాబూరావు, రంగరాజు, వంతాల నరేష్‌, బెదర బంగార్రాజు, పలాసి రామారావు, మినుముల వెంకటరావు, లక్ష్మోజి, నర్సింగరావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ ఆశయసాధన కోసమే ఆవిర్భావం : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ టౌన్‌: దివంగత సీఎం వైఎస్‌ ఆశయసాధనకోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నియోజకవర్గ కేంద్రమైన అరకులోయ వైఎస్‌ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అరకులోయ ఏరియా ఆస్పత్రిలో పార్టీ శ్రేణులతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వేసిన బాటలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నడుస్తున్నారని, సంక్షేమ పథకాలను గడప గడపకూ అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తక్కువ, ప్రచార ఆర్భాటం ఎక్కువని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నింటినీ వైఎస్సార్‌ సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.గత ఐదేళ్ల పాలనలో జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, మాట తప్పని.. మడమ తిప్పని నేతగా నిలిచారని స్పష్టం చేశారు. జగన్‌ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో మనమంతా కష్టపడి పనిచేసి 2029లో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసి, ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్‌ కుమార్‌, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి లశోక్‌ కుమార్‌, రాష్ట్ర ఎస్టీ సెల్‌ సంయుక్త కార్యదర్శి జన్ని నర్సింహమూర్తి, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్‌ కుమార్‌, గుడివాడ ప్రకాష్‌, వైస్‌ ఎంపీపీ కిల్లో రామన్న, ఎంపీటీసీ దురియా ఆనంద్‌ కుమార్‌, డుంబ్రిగుడ వైస్‌ ఎంపీపీ కూడ పాపారావు, వార్డు సభ్యుడు మాధురి శివ తదితరులు పాల్గొన్నారు.

అరకులో వైఎస్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, పార్టీ నాయకులు

పాడేరు జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పాలు, రొట్టెలను పంపిణీ చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పార్టీ నేతలు

అరకు ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, పార్టీ నేతలు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలోనే

గిరిజనాభివృద్ధి

ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు

జిల్లావ్యాప్తంగా వేడుకలు,

సేవా కార్యక్రమాలు

గిరిజన గడ్డపై మిన్నంటిన నినాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement