దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన స్పీకర్‌ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన స్పీకర్‌

Mar 19 2026 7:49 AM | Updated on Mar 19 2026 7:49 AM

జెండా ఊపి పథకాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం : ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని స్పీకర్‌ సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించామన్నారు. 40 శాతంకు పైగా వైకల్యం ఉండే దివ్యాంగులు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ధీరజ్‌, పలువురు ప్రజాప్రతినిథులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement