23న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

23న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

Mar 17 2026 7:54 AM | Updated on Mar 17 2026 7:54 AM

● ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ

నక్కపల్లి: ఆర్సిలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ ఇండియా లిమిటెడ్‌ వారు ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ప్లాంట్‌కు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన జరగనుందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. భూమి పూజ, బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం ఆమె కలెక్టర్‌ విజయ కృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణలతో కలసి పరిశీలించారు. చందనాడ సమీపంలో భూమి పూజకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్‌, ఆర్డీవో వి.వి. రమణ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొప్పిశెట్టి వెంకటేష్‌ పాల్గొన్నారు.

పొట్టిశ్రీరాములకు ఘన నివాళులు

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నక్కపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి హోం మంత్రి అనిత నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement