పలు అభివృద్ధి పనులకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

Mar 14 2026 7:42 AM | Updated on Mar 14 2026 7:42 AM

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

దేవరాపల్లిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి పార్కును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండారు, వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజభరత్‌, చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌

కె.కోటపాడు : వీఎంఆర్డీఏ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. కె.కోటపాడులో సుమారు కోటి రుపాయల నిధులతో కల్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ భూమి పూజ చేశారు. అనంతరం కె.కోటపాడులో పీఎం కిసాన్‌ నగదు రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రొంగలి మహేష్‌, ఎంపీపీ జగన్‌మోహన్‌, ఏవో సోమశేఖర్‌, పాల్గోన్నారు.

ఇంటింటి కుళాయిలు, పార్క్‌ ప్రారంభం

దేవరాపల్లి: జల్‌ జీవన్‌ మిషన్‌ స్కీమ్‌ కింద దేవరాపల్లిలో నిర్మించిన మంచినీటి ట్యాంక్‌, ఇంటింటి కుళాయిలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. అలాగే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన పార్క్‌, యోగా సెంటర్‌ భవనాన్ని కమిషనర్‌ తేజ్‌ భరత్‌, చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌తో కలిసి ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement