బ్రాండిక్స్‌ పనులు అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

బ్రాండిక్స్‌ పనులు అడ్డగింత

Mar 15 2026 1:17 AM | Updated on Mar 15 2026 1:17 AM

అచ్యుతాపురం: తమ గ్రామాన్ని తరలించిన తర్వాతే బ్రాండిక్స్‌ పనులు చేపట్టాలని అచ్యుతాపురం మండలంలోని దుప్పుతూరు ప్రజలు శనివారం ఆందోళన చేశారు. బ్రాండిక్స్‌ సిబ్బంది చేపడుతున్న పనులను సర్పంచ్‌ దేశంశెట్టి శంకర్‌రావు ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు,స్థానికులు కలిసి అడ్డుకున్నారు.ఈ సందర్భంగా దుప్పుతూరు సర్పంచ్‌ శంకర్‌రావు మాట్లాడుతూ ఏపీఐఐసీ అధికారులు,బ్రాండిక్స్‌ యాజమాన్యం దుప్పుతూరు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భూముల సేకరణ వల్ల నష్టపోయిన ప్రజలకు ప్యాకేజీ అందజేయాలని,గ్రామాన్ని తరలించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.ప్రగడ రాజు,ప్రగడ నాగేశ్వరరావు, దేశంశెట్టి పైడియ్యనాయుడు, దేశంశెట్టి వెంకటరమణ, దేశంశెట్టి ఈశ్వరరావు, దేశంశెట్టి యల్లయ్యనాయుడు, దేశంశెట్టి అప్పలనాయుడు, ప్రగడ తాతబాబు, దేశంశెట్టి త్రినాఽథ్‌,బద్ది తాతాజీ,నందారపు త్రినాఽథ్‌,శెట్టి కాసుబాబు,దేశంశెట్టి తాతీలు,నందారపు శివ,రావి కాసుబాబు,దేశంశెట్టి నానాజీ,పట్టుగర్ల యల్లయ్యనాయుడు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement