నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షలను దోచేస్తున్న గౌరీ శంకర్ ఫిషర్‌మాన్ కో ఆపరేటివ్ సొసైటీపై చర్యలు తీసుకోవాలంటూ పీజీఆర్‌ఎస్‌లో 25 సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, తనపై వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మునగపాకకు చెందిన బేరా శ్రీను వాపోయాడు. సొసైటీ లెక్కలు అడిగినందుకు తన సభ్యత్వం తొలగించి ఉపాధి లేకుండా చేశారని, అధికారులు వారికే కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కలెక్టరమ్మ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పీజీఆర్‌ఎస్‌లో కోరాడు.


