అనకాపల్లి: సామాన్య కుటుంబంలో జన్మించిన మొల్ల తన అద్భుత ప్రతిభతో ‘మొల్ల రామాయణాన్ని’ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళమైన తెలుగులో రచించి చరిత్రలో నిలిచిపోయారని అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మొల్ల జయంతి సందర్భంగా శుక్రవారం ఆమె చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మొల్ల చేసిన అక్షర కృషి నేటి తరానికి, మహిళా సాధికారతకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు. పట్టుదల, సాహిత్య సేవను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, సీఐలు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, రమేష్, దేవుళ్ళు, పిల్లా రమేష్, ఎస్‌ఐలు ప్రసాద్, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో...
తుమ్మపాల: కలెక్టరేట్‌లో కవయిత్రి మొల్లమాంబ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి తెలుగు మహిళా కవయిత్రిగా మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీదేవి, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
తొలి తెలుగు కవయిత్రి మొల్ల
అనకాపల్లి: పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు విల్లూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్‌రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కుమ్మర కులంలో పుట్టిన మొల్ల తొలి తెలుగు కవయిత్రిగా ప్రసిద్ధి కెక్కి, రామాయణం రచించి ప్రజలకు అంకితం చేశారన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాల భరత్‌కుమార్, కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, తదితరులు పాల్గొన్నారు.


