ముంచంగిపుట్టు :మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో మత్స్యగెడ్డలో స్నానం చేస్తూ గల్లంతైన వంతాల గోపీనాథ్(72) అనే గిరిజనుడు మృతిచెందాడు. వారం రోజుల తరువాత మృతదేహం లభించింది. ఈ నెల 10న గల్లంతైన గోపీనాథ్ కోసం కుటుంబ సభ్యులు,స్థానిక గిరిజనులు నాటు పడవలపై రెండు రోజుల పాటు గాలించారు. అనంతరం విశాఖకు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చి రెండు రోజుల పాటు రెండు కిలో మీటర్ల మేర గాలింపు చేసినా ఫలితం లేకపోయింది. వారం రోజుల తరువాత సోమవారం మత్స్యగెడ్డ ఒడ్డున గోపీనాథ్ మృతదేహాన్ని గుర్తించిన స్థానిక గిరిజనులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నానీ, ఆర్‌ఐ భాస్కర్,సర్పంచ్ రమేష్,మండల వైఎస్సార్‌సీపీ నేత దేవాలు మత్స్యగెడ్డ నుంచి గోపినాథ్ మృతదేహానికి బయటకు తీయించారు.మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది.పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వారం రోజుల తరువాత లభించిన మృతదేహం


