● దారకొండ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుల పిలుపు
కర్ర పత్రాలు పంపిణీ చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు
సీలేరు: గిరిజన సాంస్కృతిక సంగమం కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ యాత్రను గిరిజనులందరూ విజయవంతం చేయాలని దారకొండ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు కోరారు. మంగళవారం గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ గ్రామంలో వారు కరపత్రాలను పంపిణీ చేశారు. మే 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలోని హిందువులందరూ తరలివచ్చి, గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు ఒక ముఖ్యమైన డిమాండ్‌ను వినిపించారు. మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.గూడెం కొత్తవీధి మండలంలోని 16 పంచాయతీల్లో దశలవారీగా పర్యటిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని, హిందూ ధర్మ ప్రచారం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సభ్యులు పేర్కొన్నారు.


