లీఫ్‌ కాఫీ యూనిట్ల ఏర్పాటుకు త్వరలో ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

లీఫ్‌ కాఫీ యూనిట్ల ఏర్పాటుకు త్వరలో ఒప్పందం

Mar 17 2026 7:54 AM | Updated on Mar 17 2026 7:54 AM

చింతపల్లి: జిల్లాలో కాఫీ ఆకులతో కాఫీ తయారు చేసే యూనిట్ల ఏర్పాటుకు ఐటీడీఏతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు గ్రీన్‌ ఆయుష్‌ సీఈవో పులి రాజేష్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ను గ్రీన్‌ ఆయుష్‌ ప్రతినిధులు కలిసి లీఫ్‌ కాఫీ యూనిట్ల ఏర్పాటుపై చర్చించినట్టు చెప్పారు. కాఫీ ఆకులతో లీఫ్‌ కాఫీ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేసి, రైతులకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కలెక్టర్‌ను కలిశామన్నారు. మొదటిగా ఏదో ఒక మండలంలో కాఫీ ఆకులు సేకరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపీవో వెంకటేశ్వరావుకు కలెక్టర్‌ ఆదేశించారన్నారు. ఐటీడీఏ కేటాయించిన ప్రాంతంలో కాఫీ ఆకులను సేకరించి లీఫ్‌ కాఫీ తయారీకి పంపుతామని చెప్పారు.చింతపల్లి మండలంలో ఐదు లీఫ్‌ కాఫీ యూనిట్లు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం రైతుల నుంచి సేకరించిన కాఫీ ఆకులను కిలో రూ.17.28 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అధిక మొత్తంలో లీఫ్‌కాఫీ ఉత్పత్తి చేసేందుకు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఆయన తెలిపారు.తొలి సారిగా కాఫీ ఆకులతో రైతులకు ఆదాయం సమకూరేలా గ్రీన్‌ ఆయుష్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు.ఈకార్యక్రమంలో గ్రీన్‌ ఆయుష్‌ ప్రతినిధులు కనకరాజు,షేక్‌ రజాక్‌,బుజ్జిబాబులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement