నూకాంబిక ఆలయ హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

నూకాంబిక ఆలయ హుండీ లెక్కింపు

Mar 12 2026 7:30 AM | Updated on Mar 12 2026 7:30 AM

అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ ఉద్యోగులు

అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 11వ తేదీ వరకూ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 27లక్షల 11వేల 713 నగదు, 11 గ్రాముల బంగారం, 550 గ్రాములు వెండి వచ్చినట్టు దేవదాయశాఖ ఈవో యళ్ల శ్రీధర్‌, ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీనులు చెప్పారు. దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ కె.ఎల్‌.సుధారాణి, దేవదాశాఖ ఇన్‌స్పెక్టర్‌ వసంత కుమార్‌ ఆధ్వర్యంలో అమ్మవారి నగదును యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవరపాలెం బ్రాంచ్‌ దేవదాయశాఖ బ్యాంక్‌ ఖాతాలో పట్టణ పోలీసుల సహకారంతో జమచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్‌, దాడి రవికుమార్‌, పొలిమేర స్వాతి ఆనంద్‌, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్‌,వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడ్రాజు, యరవ్రరపు సంతోషి కుమారి నాగేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement