జనసేన పార్టీ నేత ఏకరువు | - | Sakshi
Sakshi News home page

జనసేన పార్టీ నేత ఏకరువు

Mar 15 2026 1:17 AM | Updated on Mar 15 2026 1:17 AM

నందిగరువు గ్రా మంలో నిర్వహించిన ‘మాటామంతి’ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలే సమస్యలపై ఏకరువు పెట్టారు. గిరిజన రైతులు పండించే కాఫీ, పసుపు, మిరియం పంటలపై వ్యాపారులు 50 కిలోల బస్తాకు 5 కిలోల వరకు తరుగు తీస్తూ దోచుకుంటున్నారని జనసేన కార్యకర్త, పాడేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పాంగి శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మిరియాల ధర కిలో రూ.650 ఉండగా, బస్తాకు రూ.4 వేల వరకు రైతులు నష్టపోతున్నారని, ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేపట్టాలని కోరారు.చింతపల్లి మండలం కొత్తమాడెం, పాతమాడెం వంటి గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేదని, ఆరు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement